ఉపా కేసును వెంటనే ఎత్తివేయాలి.. - సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్

ఉపా కేసును వెంటనే ఎత్తివేయాలి.. - సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్): పి వో డబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి సంధ్య. పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ హారగోపాల్ తో పాటు 156 మంది ప్రజా సంఘాల నాయకులపై ములుగు జిల్లా తాడువాయి పోలీసులు పెట్టిన అక్రమ ఉపా కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ముద్రించిన గోడ ప్రతులను గ్రామ శాఖ కార్యదర్శి పంజాల మురళి ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ 2020 లో ములుగు జిల్లా తాడువాయి సమీపంలో మావోయిస్టులను కలిశారనే ఆరోపణతో సంధ్య. ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు 156 మంది ప్రజా సంఘాల నాయకులపై దేశద్రోహ నేరం కింద క్రమంగా కేసులు పెట్టడాన్ని తప్పుపట్టారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయం నుండి ముందుండి పనిచేసిన సంధ్య పై అక్రమంగా కేసులు పెట్టడం వెనుక కేసీఆర్ నిరంకుశ విధానాలకు నిదర్శనమని మండి పడ్డారు. సంధ్య. ప్రొఫెసర్ హారగోపాల్ తో పాటు నూట యాభై ఆరు మంది ప్రజాసంఘాల నాయకులు అక్రమంగా నమోదు చేసిన ఉపా కేసులను ఉపసంహరించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలోని అన్ని ప్రజా సంఘాల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూష శ్రీశైలం. పంజాల గోవర్ధన్. తివారి. పి నరేష్. కుండే శ్రీకాంత్. ఆరే కృష్ణ తో పాటు తదితరులు పాల్గొన్నారు....