కాంగ్రెస్ పార్టీ ని వీడి బి ఆర్ఎస్ పార్టీలో చేరిన మైనార్టీలు

కాంగ్రెస్ పార్టీ ని వీడి బి ఆర్ఎస్ పార్టీలో చేరిన మైనార్టీలు

భువనగిరి అక్టోబర్ 19 (ముద్ర న్యూస్) భువనగిరి పట్టణంలో 27 వ వార్డ్ జలీల్ పుర నుండి గత 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు  సుమారు 50 మంది గురువారం బిఆర్ఎస్ పార్టీ  భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఫైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీలో  చేరామని అన్నారు.