డా.బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి : ఎమ్మెల్యే

డా.బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి : ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి భువనగిరి :డా.బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన వర్ధంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో ప్రిన్స్ చౌరస్తా వద్ద గల డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పిటిసి బీరు మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్  రాజేందర్ రెడ్డి,  మున్సిపల్ చైర్ పర్సన్ ఆంజనేయులు, వైస్ చైర్మన్ కిష్టయ్య, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు  జనగాం పాండు, బి ఆర్ ఎస్ నాయకుల అప్పగాని వెంకట్, నాగారం సూరజ్ పాల్గొన్నారు.