ఎల్ఓసి చెక్కు అందించిన ప్రభుత్వ విప్

ఎల్ఓసి చెక్కు అందించిన ప్రభుత్వ విప్

గుండాల ఆగస్టు 09 (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోనీ మాసాన్ పల్లి గ్రామానికి చెందిన పాలడుగు యాదమ్మ కిడ్నీ సంబంధిత సంబంధిత వ్యాధితో అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది ఇట్టి విషయాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి సహకారంతో 2 లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసి చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు అట్ల రంజిత్ రెడ్డి, గ్రామ ప్రధాన కార్యదర్శి గోపాల్ దాస్ స్వామి, చంద్రగిరి చిన్న యాదగిరి, పాలడుగు ఏల్లేష్, పాలడుగు నర్సింహ, పాలడుగు దేవా తదితరులు పాల్గొన్నారు.