"గృహలక్ష్మి" లబ్దిదారుల ఆందోళన

"గృహలక్ష్మి" లబ్దిదారుల ఆందోళన

ఇబ్రహీంపట్నం, ముద్ర: గృహలక్ష్మి దరఖాస్తులు స్వీకరించడం లేదని యాచారం తహశీల్దార్ కార్యాలయం ముందు బుధవారం లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసుకునేందుకు కేవలం మూడు రోజులు మాత్రమే గడువు విధించింది. ఇదిలా ఉండగా మండల స్థాయి అధికారులకు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో వారు గృహలక్ష్మి లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు వెనుకాడుతున్నారు. దీంతో లబ్ధిదారులు మండల కార్యాలయాల ముందు ఆందోళనకు దిగుతున్నారు. కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీలో జాప్యంతో పాటు దరఖాస్తులు ఎలా చేయాలన్న దానిపై స్పష్టత కరువయ్యింది. దీంతో సుధూర ప్రాంతాల నుండి మండల కేంద్రాలకు వచ్చి మండల కార్యాలయాల ముందు లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. అధికారులు మాత్రం దరఖాస్తులు స్వీకరించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చేపడుతున్నారు. అధికారులు మాత్రం తమకు ఎలాంటి మార్గదర్శకాలు లేవని అందుకే లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడం లేదని చెబుతున్నారు.