ఓఆర్ఆర్ పై 1, 2 లేన్ లలో స్పీడ్ పరిమితి 120 కి పెంపు

ఓఆర్ఆర్ పై 1, 2 లేన్ లలో స్పీడ్ పరిమితి 120 కి పెంపు
  • 2,4 వ లేన్ లలో వేగ పరిమితి 80
  • అదేశాలు జారి చేసిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : ఓఆర్ఆర్ పై 1, 2 లేన్ లలో స్పీడ్ పరిమితి 120 కె ఎమ్ పి హెచ్  కి, 2,4 వ లేన్ లలో వేగ పరిమితి 80 కె ఎమ్ పి హెచ్ కి పెంచుతూ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. 

ప్రస్తుతం వేగంగా వేళ వాహనాలకు    ఓఆర్ఆర్ పై నిర్ధేశించిన 1, 2 లేన్ లలో స్పీడ్ పరిమితి 100 కె ఎమ్ పి హెచ్  ఉండగ 120  కె ఎమ్ పి హెచ్  కి పెంచారు. అదే విదంగా నెమ్మదిగా వేళే వాహనాల కు నిర్ధేశించిన 2,4 వ లేన్ లలో వేగ పరిమితి 80  కె ఎమ్ పి హెచ్ కి పెంచి కనీస వేగంని 40 కె ఎమ్ పి హెచ్ గా నిర్ణయించారు.

అదేవిదం గా ఓ ఆర్ ఆర్ పై వాహనాలు నిలపడం, ప్రయాణికులను దించాం, తీసుకురావడం పై నిషేదం కొనసాగుతున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.