ట్రాఫిక్ సమస్యల పరిష్కరం పై దృష్టి సారించిన  జిహెచ్‌ఎంసి సైబరాబాద్ పోలీసులు

ట్రాఫిక్ సమస్యల పరిష్కరం పై దృష్టి సారించిన  జిహెచ్‌ఎంసి సైబరాబాద్ పోలీసులు

పలు ప్రాంతాలలో పర్యాటించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోజ్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రలు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి: సైబరాబాద్ లో ని పలు ప్రాంతాలు లలోట్రాఫిక్  సమస్యలను  పరిష్కరించడని తీస్కోవాల్సిన చర్యలు గురించి సైబరాబాద్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇందులో బాగంగా  బుధవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోజ్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రలు పలు ప్రాంతాల్లో  పర్యాటించి ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడకుండా తీయాల్సిన చర్య ల గురించి చర్చించారు.

సైబరాబాద్ ప్రాంతంలోని ఐకియా , లెమన్ ట్రీ హోటల్, సైబర్ టవర్లు, కైతలాపూర్ ROB, గోకుల్ ప్లాట్లు, ఫోరమ్ మాల్, కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్, IIT జంక్షన్, రాడిసన్ హోటల్ ప్రాంతాల లో  జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోజ్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర లతో పాటు టి ఎస్ ఐ ఐ సి, జి హెచ్ ఎం సి  కి చెందిన పలువురు అధికారులు పర్యాటించారు.
 
ఆయా ప్రాంతాలలోని వాటర్ లాగింగ్ పాయింట్లు, రోడ్లు మరియు జంక్షన్ల అభివృద్ధి, బాటిల్నెక్స్ రిమూవల్ తదితర అంశాలను చర్చించారు.

సీపీ గారి వెంట మాదాపూర్ లా అండ్ ఆర్డర్ డిసిపి సందీప్, శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ఏడీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ రణవీర్ రెడ్డి, 
రాయదుర్గం ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్రీనాథ్, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నర్సయ్య, గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి   తదితరులు పాల్గొన్నారు.