జేఎల్ఎం ఆయువు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్

జేఎల్ఎం ఆయువు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్
  • అప్పులపాలై యువకుడు ఆత్మహత్య


ముద్ర ప్రతినిధి, ఇబ్రహీంపట్నం: సరదాగా మొదలై అలవాటుగా మారి చివరికి వ్యసనంగా మారిన ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఓ నిండు ప్రాణం ఆయువు తీసింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కు బానిసై భారీగా అప్పులు చేసి, చేసిన అప్పులు తీర్చలేక ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. ఇబ్రహీంపట్నం రాయపోల్‌ గ్రామానికి చెందిన గుండ్లపల్లి శివారెడ్డి(25) గత నాలుగేళ్లుగా యాచారం మండలంలో జూనియర్ లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతను ఆన్ లైన్ గేమ్స్ లో భారీగా బెట్టింగ్ పెట్టేవాడు. ఈ అలవాటు కాస్తా వ్యసనంగా మారింది. దీంతో భారీగా అప్పులు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.