కక్ష్య పురితంగానే నాపై ఐటి సోదాలు భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి

కక్ష్య పురితంగానే నాపై ఐటి సోదాలు భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి

నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికే బీజేపీ ప్రభుత్వం అధికారులను అడ్డం పెట్టుకొని నాపై ఐటి సోదాలు నిర్వహించారని ప్రజలలో మా పార్టీ పై నాపై ఇంకా పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక మాపై బురద చల్లే ప్రయత్నంలో భాగమే ఈ ఐటీ సోదాలు అని BRS పార్టీ భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి గారు ఈరోజు కొత్తపేట లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మొత్తం ఒక గంటన్నర వ్యవధి లొనే సోదాలు పూర్తి అయిన కావాలనే మూడు రోజులపాటు నన్ను ఇబ్బంది పెట్టారని BRS పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడుతున్నారు.

అని తెలంగాణా ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో భువనగిరిలో మళ్ళీ నన్ను మూడవసారి ఆశీర్వదిస్తారని అధికారులు మూడు రోజులు సోదాలు నిర్వహించినా వారికి ఎటువంటి ఆధారాలు లభించలేదని వ్యాపారాల్లో గాని రాజకీయాల్లోగాని నీతి , నిబద్ధత లతో ఉన్న నన్ను ఈరకంగా ఇబ్బంది పెట్టడం వారికి తగదన్నారు. దమ్ము ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో ధైర్యంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు.