బీసీ బందును బిఆర్ఎస్ బందుగా మార్చారు....

బీసీ బందును బిఆర్ఎస్ బందుగా మార్చారు....
  • యువజన కాంగ్రెస్ ఆరోపణ....

ఆలేరు (ముద్ర న్యూస్):తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన బిసి బందు పథకాన్ని బిఆర్ఎస్ బందుగా మార్చారని యువజన కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో యువజన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బండపల్లి మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు మహేందర్ రెడ్డి ఆలేరు పట్టణ కేంద్రంలో పంపిణీ చేసిన బీసీ బందు పథకంలో అధికార పార్టీకి చెందిన వారికే కేటాయిస్తూ అర్హులైన వారికి తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. గ్రామాలలో నివాసం ఉండకుండా హైదరాబాదులో ఉన్నవారికి బీసీ బందు పథకం ఎక్కించడంతో అధికార పార్టీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ కులాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బందు పథకం ప్రవేశపెట్టి ఇటీవల ప్రకటించిన పార్టీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు మొండి చేయి చూపడం తగదని అన్నారు. బీసీ బందు పథకం. పార్టీ అభ్యర్థుల జాబితాలలో అన్యాయం చేసిన అధికార టిఆర్ఎస్ పార్టీకి రానున్న ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పి ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజల కాంగ్రెస్ నాయకులు చీరబోయిన మధు. పుట్టి సాయి. డేగల చందు. ఊదరి శ్రీకాంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.....