జిల్లాలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

జిల్లాలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

ముద్ర ప్రతినిధి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా  వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం జిల్లాలో నమోదయిందని  అధికారులు తెలిపారు. అత్యధికంగా రాజపేటలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అతి తక్కువగా చౌటుప్పల్ లో 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. తుర్కపల్లిలో 85 మిల్లీమీటర్లు,  ఆలేరులో 89, మోటకొండూరులో 56, యాదగిరిగుట్టలో 86, భువనగిరిలో 46, బొమ్మలరామారం 46, బీబీనగర్ లో 28 మిల్లీమీటర్లు జిల్లా వ్యాప్తంగా 17 మండలాలలో సగటున వర్షపాతం నమోదయిందని చెప్పారు. అధికారులంతా ప్రజలను అప్రమతం చేయడం జరిగిందని తెలిపారు. రాగల రెండు రోజులలో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా  ఉండాలని సూచిస్తున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లడం  జరుగుతుందని ప్రజలంతా ఎవరూ దాటవద్దని హెచ్చరించడం జరిగిందన్నారు.