అనారోగ్యంతో చనిపోయిన పోలీసుల కుటుంబ సబ్యులకు ఆర్దిక సహాయం అందజేసిన రాచకొండ పోలీసు కమిషనర్

అనారోగ్యంతో చనిపోయిన పోలీసుల కుటుంబ సబ్యులకు ఆర్దిక సహాయం అందజేసిన రాచకొండ పోలీసు కమిషనర్

ముద్ర ప్రతినిధి భువనగిరి :అనారోగ్యంతో చనిపోయిన పోలీసుల కుటుంబ సభ్యులకు  రాచకొండ పోలీసు కమిషనర్ డి.యస్. చౌహాన్ ఆర్థిక సహాయం అందజేశారు. గురువారం రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయం నేరేడ్ మెట్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అనారోగ్యంతో మరిణించిన ఉప్పల్ ట్రాఫిక్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్  యస్. లక్ష్మి రెడ్డి కుటుంబ సభ్యులకు భద్రత నుండి 7,74,793=00 రూపాయిల  చెక్కులు భార్య లావణ్య కు 3,74,793/-, కొడుకు హృషీకేశి రెడ్డి కి 2 లక్షలు, కూతురు వైష్ణవి కి 2 లక్షలు అందజేశారు.

అనారోగ్యంతో చనిపోయిన భువనగిరి హెడ్ కానిస్టేబుల్ టి. విజయ భాస్కర్ రావు కుటుంబ సబ్యులకు 7,77,058=00 రూపాయిల  చెక్కులు భార్య శోభారాణి కి 5,77,058, కూతురు చరిస్మా కి 2 లక్షలు చెక్కులు అందజేశారు. వీరిద్దరికి తొందరగా పెన్షన్, ఉద్యోగం త్వరగా వచ్చేవిదంగా చర్యలు తీసుకోవాలని రాచకొండ సి‌పి  సంబధిత అదికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమములో డి‌సి‌పి అడ్మిన్  పి. ఇందిర, అడిషనల్ డి‌సి‌పి అడ్మిన్ వి. శ్రీనివాస్ రెడ్డి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు సి‌హెచ్. భద్రా రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.