యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వనగంటి వెంకటేష్ యాదవ్ నియామకం

యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వనగంటి వెంకటేష్ యాదవ్ నియామకం

భువనగిరి వలిగొండ,ముద్ర న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వలిగొండ మండలం పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన వనగంటి వెంకటేష్ యాదవ్ నియమితులు అయ్యారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో నియామక పత్రాన్ని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భువనగిరి అసెంబ్లీ ఇంచార్జీ వేలిమినేటి సురేష్, అసెంబ్లీ అధ్యక్షులు అవైస్ చిస్తీలు నియామక పత్రం అందచేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను ప్రజల్లోకి  తీసుకెళ్లి, గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 200 గడపలను పూర్తి చేసినందుకు ప్రతిఫలంగా పదవిని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.