తెలంగాణ ప్రభుత్వం, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ 2023-25 సంవత్సరాలకు గాను ఎక్సైజ్ పాలసీని విడుదల

తెలంగాణ ప్రభుత్వం, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ 2023-25 సంవత్సరాలకు గాను ఎక్సైజ్ పాలసీని విడుదల

భువనగిరి ఆగస్టు 04 (ముద్ర న్యూస్):-యాదాద్రి భువనగిరి జిల్లాలో గల 82 వైన్స్ షాపులకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగినది అని యాదాద్రి భువనగిరి జిల్లా సూపరిండెంట్ నవీన్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 4 ఎక్సైజ్ స్టేషన్ లు వున్నాయని భువనగిరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 1 నుండి 27 షాప్ లు, రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 28 నుండి 45 షాప్ లు, ఆలేర్ ఎక్సైజ్ స్టేషన్ లో 46 నుండి 67 వరకు మరియు మోత్కూర్ స్టేషన్ లో 68 నుండి 82 వరకు ఉన్నవి. ఇట్టి వైన్స్ లలో 21 షాప్ లు గౌడ్ కులస్తులకు, 07 షాప్ లు ఎస్సీ లకు మరియు 01 ఎస్టి వారికి కేటాయించడం జరిగినది అని అన్నారు. కేటాయించిన షాపు వివరాలు గజిట్ లో పొందుపర్చటం జరిగింది అని అన్నారు.దరఖాస్తు దారులు ఆధార్ కార్డు, పాన్ కార్డు,దరకాస్తు రుసుము రూపాయలు 2 లక్షల డిడి రూపములో కాని చలాను రూపములో కాని ఇవ్వాలని అన్నారు.గౌడ్, ఎస్సీ, ఎస్టి, లకు కేటాయించిన షాపులకు దరఖాస్తు చేయవల్సిన వారు కుల ధృవీకరణ పత్రం తప్పనిసరి అని తెలిపారు.