బహుజన పోరాటయోధుడు పాపన్న: చైర్మన్

బహుజన పోరాటయోధుడు పాపన్న: చైర్మన్

ముద్ర ప్రతినిధి భువనగిరి : బహుజన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని భువనగిరి చైర్ పర్సన్ ఎన్నబోయిన ఆంజనేయులు అన్నారు.  శుక్రవారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని భువనగిరి కోట వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్  చింతల కిష్టయ్య,  స్థానిక వార్డు సభ్యులు వడిచర్ల లక్ష్మీ కృష్ణ,  ఆబోతుల కిరణ్ కుమార్, నాయకులు కుషంగల రాజు  పాల్గొన్నారు.