బీహార్ ప్రజల్లో అపనమ్మకాలను కలిగిస్తారా?

బీహార్ ప్రజల్లో అపనమ్మకాలను కలిగిస్తారా?
  • నితీశ్​పై ప్రశాంత్ ​కిషోర్ ​ఫైర్​

పాట్నా: బీహార్​సీఎం నితీశ్​కుమార్​పై జన్ సూరజ్ పాదయాత్ర రూపశిల్పి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విరుచుకుపడ్డారు. సమస్తిపూర్​లో పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతూ.. వందేళ్లలో ప్రపంచం అంతమవుతుందని ఆయనకెలా తెలుసని ప్రశ్నించారు. సెమీ కండక్టర్​అంటే ఏమిటో సీఎం చెప్పాలని, ఒకవేళ ఆయన సరైన అర్థం చెబితే ఆయన చెప్పులు తలపై పెట్టుకోవడానికైనా తాను సిద్ధమేనని ప్రశాంత్​ అన్నారు. సెమీకండక్టర్​గురించి అడిగితే స్వయానా సీఎం కేబినెట్​ మంత్రులకు కూడా తెలియదని విమర్శించారు. ఆయన బీహార్​ను ఏ మూలన అభివృద్ధి చేయలేదన్నారు. రూ. 400 వృద్ధాప్య పింఛన్, పదేళ్ల క్రితం సైకిళ్లు పంచి ప్రజలను నిరక్ష్యరాస్యులు, కూలీలుగా మార్చాడని ఆరోపించారు. ఓవైపు ప్రపంచం ఆర్టిఫిషియల్​ ఇంటలిజెన్స్​వైపు అడుగులు వేస్తుండగా సీఎం నితీశ్​ మాత్రం బీహార్​ ప్రజల్లో మూఢనమ్మకాలను, అపనమ్మకాలను ప్రబలుస్తున్నారని విమర్శించారు. బీహార్​ను ఇంకా చీకట్లోనే ఉంచాలని సీఎం భావిస్తున్నారేమో అని దుయ్యబట్టారు. ఇంకా నితీశ్​కుమార్​ 1960 కాలంలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ధోతీ, కుర్తా-పైజామా ధరించి బయటకు వెళ్లినప్పుడు, తామే గొప్ప నాయకులమని నితీశ్​ భావిస్తున్నట్టున్నారని విమర్శించారు.