వడపర్తి కత్వా గేటు తెరిపించిన మున్సిపల్ చైర్మన్

వడపర్తి కత్వా గేటు తెరిపించిన మున్సిపల్ చైర్మన్

ముద్ర ప్రతినిధి భువనగిరి : మండలంలోని వడపర్తి కత్వాన్ని భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాలతో షామీర్పేట్ చెరువు నుండి వస్తున్నటువంటి నీటి  ప్రవాహాన్ని వడపర్తి కత్వ వద్ద పరిశీలించి భువనగిరి చెరువుకు నీరు తక్కువగా వస్తుందని కత్వ మరొక్క గేటును తెరిపించడం జరిగిందన్నారు. భువనగిరి చెరువు నిండే విదంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.