అభివృద్ధి పనులను పరిశీలించిన చైర్మన్

అభివృద్ధి పనులను పరిశీలించిన చైర్మన్

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి పట్టణంలోని 16వ, 26వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి నిధుల ద్వారా పనులను చేపట్టడం జరిగిందన్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పోత్నక్ ప్రమోద్ కుమార్, ఈరపాక నరసింహ, నాయకులు కడారి వినోద్ కుమార్ వార్డు ప్రజలు పాల్గొన్నారు.