ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం

ముద్ర ప్రతినిధి భువనగిరి :ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కొమరం భీమ్, సేవాలాల్ మహారాజ్ కు పూలమాలవేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ జిల్లా చైర్మన్ రాంజీ నాయక్ మాట్లాడుతూ భారత దేశంలో ఆదివాసుల మీద దాడులు రోజురోజుకు ఎక్కువవ్వవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు, ఆదివాసులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. సోయం బాబురావు బిజెపి ఎంపీ తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసి గిరిజనుల మధ్య జాతీయ భేదం పెంపొందించి కుల రాజకీయాలను చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  వెంటనే స్పందించి సోయం బాబు రావు ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నా రు. ఈ కార్యక్రమం లో   ఎస్టీ సెల్ తుర్కపల్లి మండల అధ్యక్షుడు బానోత్ పట్టు నాయక్, బొమ్మలారామారం ఎస్టీ సెల్  అధ్యక్షుడు నర్సింహ నాయక్, తుర్కపల్లి మండల కాంగ్రెస్ నాయకుడు రాజేశ్ నాయక్, సీనియర్ నాయకులు  పచ్య నాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటేశ్ నాయక్ పాల్గన్నారు.