భూముల వేలం కు సంబందించి హెచ్ఎండీఎ మరో నోటిఫికేషన్

భూముల వేలం కు సంబందించి హెచ్ఎండీఎ మరో నోటిఫికేషన్

  • రంగా రెడ్డి జిల్లాలో 8, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8, సంగారెడ్డి జిల్లాలో 10 ల్యాండ్ పార్సిళ్ల కు నోటిఫికేషన్

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి:-భూముల వేలం కు సంబందించి హెచ్ఎండీఎ జోరు కొనసాగుతోంది. మరోసారి భూముల ఈ-వేలానికి హెచ్ఎండీఏ సిద్ధమైంది. రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో భూముల విక్రయానికి బుధవారం హెచ్ఎండీఎ నోటిఫికేషన్ జారీ చేసింది.

రంగా రెడ్డి జిల్లాలో 8, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 8, సంగారెడ్డి జిల్లాలో 10 ల్యాండ్ పార్సిళ్లను విక్రయించను న్నట్టు తెలిపింది. రంగారెడ్డి జిల్లా లోని బైరాగిగూడ లో 2420 చదరపు గజాలు, మంచిరేవుల లో 5082 చదరపు గజాలు,  కోకాపేట లో 8591 చదరపు గజాలు,  నల్లగండ్ల 2420 చదరపు గజాలు, 4840 చదరపు గజాలు, బుద్వేల్ lo 4356 చదరపు గజాలు,  చందానగర్ లో 1694 చదరపు గజాలు, పీరంచెరువు లో 4477 చదరపు గజాలు,  మేడ్చల్ - మల్కాజిగిరిలోని బాచుపల్లి, బౌరంపేట, చెంగిచెర్ల, సూరారం.. సంగారెడ్డిలో వెలిమల, నందిగాయ, అమీన్పూర్, పతిఘనపూర్, కిష్టారెడ్డిపేట ప్రాంతాల్లోని భూములను విక్రయించనుంది.

ప్లాట్ల విస్తీర్ణం 302 చదరపు గజాల నుంచి 8,591 చదరపు గజాల వరకు ఉన్నాయి.చదరపు గజానికి కనీస ధర 12వేలు, గరిష్ఠ ధర 65వేలుగా నిర్ణయించారు.  రిజిస్ట్రేషన్కు చివరి తేదీ ఆగస్టు 16 కాగా.. 18 నుంచి ఈవేలం నిర్వహించనున్నారు.  ఆసక్తి ఉన్న వారు ఈ నెల 16లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, 17 ఈఎండీ చెల్లించాలని సూచించింది. 18వ తేదీన ఉదయం ఈ వేలం నిర్వహించనున్నట్టు తెలిపింది.   రెండు సెషన్లలో నిర్వ హించే ఈ వేలం పాట ద్వారా భారీ ఆదాయం ఆర్జించవచ్చని సర్కారు భావిస్తోంది.