నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్

నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్
  • నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి

ముద్ర, షాద్‌నగర్:-షాద్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్  అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తన నామినేషన్  దాఖలు చేసారు. షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం నామినేషన్ వేశారు.ఈ సందర్భంగా అయన శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎలాంటి  ఆర్భాటాలు లేకుండా  స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేశారు.కాగా నామినేషన్ కేంద్రం పరిసర ప్రాంతాలలో  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి    పరిశీలించారు. స్థానిక ఏసిపి రంగస్వామి, పట్టణ సీఐ ప్రతాప్ లింగం, రూరల్ సీఐ లక్ష్మీరెడ్డి , ఇన్స్పెక్టర్ రాంరెడ్డి తదితరులు నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్.