ఆడబిడ్డగా ఆశీర్వదించండి..

ఆడబిడ్డగా ఆశీర్వదించండి..
  • భూపాలపల్లి సమస్యలు పరిష్కరిస్తా..
  • బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:మీ ఆడబిడ్డగా వచ్చాను ఆశీర్వదించి గెలిపిస్తే, భూపాలపల్లి నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు.భూపాలపల్లి రూరల్ మండల అధ్యక్షులు ఇచ్చంతుల విష్ణు అధ్వర్యంలో మంగళవారం భూపాలపల్లి మండలంలోని నేరేడుపల్లి, కొత్తపల్లి, వజినల్లి  గ్రామాల్లో బిజెపి భరోసా యాత్ర ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి పాల్గొని ఆయా గ్రామలలో గడప గడపకు ప్రచారం ప్రచారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. కొత్తపల్లి గ్రామంలో నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు కీర్తిరెడ్డికి  విన్నవించుకోగా, రాబోయే రోజుల్లో తన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరిస్తానని, అందుకు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరారు. కచ్చితంగా ఇచ్చిన మాట మీద ఉండి మీ సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు మెట్టు శ్రీనివాస్, పబ్బ శ్రీనివాస్, పోన్నం శ్రీనివాస్, శక్తి కేంద్ర ఇంచార్జీ విజేందర్ రెడ్డి, విప్లవ్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, శివనాత్రి వేణు, నాయకులు కిరణ్, సురేష్, జయపాల్ రెడ్డి, దుర్గయ్య, నరల కొమురయ్య, మమత, స్వప్న తదితరులు పాల్గొన్నారు.