కాంగ్రెస్ పార్టీ విప్పుతో వీగిపోయిన అవిశ్వాసం

కాంగ్రెస్ పార్టీ విప్పుతో వీగిపోయిన అవిశ్వాసం

మహాదేవపూర్, ముద్ర:  మహాదేవపూర్ ఎంపీపీ బాన్సోడా రాణిబాయి పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన భూపాలపల్లి ఆర్డీవో శ్రీమతి రమాదేవి ప్రకటించారు.  బిఆర్ఎస్ ఎంపీటీసీ చల్ల రమ నాయకత్వంలో ఈనెల ఆరవ తేదీన ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై నేడు ఆర్డీవో ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఐదుగురు టిఆర్ఎస్ ఎంపీటీసీలు, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీటీసీలు కలిసికట్టుగా ఈ విశ్వాసాన్ని ప్రతిపాదించారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయడంతో కోరం సరిపోక పోవడంతో టిఆర్ఎస్ వారు ఎవరు సమావేశానికి హాజరు కాలేదు.  ముగ్గురు కాంగ్రెస్ ఎంపీటీసీ శ్రీధర్ బాబు ఆధీనంలో క్యాంపులో ఉన్నారు. అవిశ్వాస తీర్మానం నిర్గాలంటే ఆరుగురు సభ్యుల మద్దతు అవసరం ఉండగా కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన వ్యక్తితో టిఆర్ఎస్ బలం ఐదుగురికి పడిపోయింది.

టిఆర్ఎస్ ఎంపీటీసీలు ఎవ్వరు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో అవిశ్వాస నిరూపణ వీగిపోయినట్లుగా ఆర్టీవో ప్రకటించారు. నోటీసు ప్రకారంగా 11 గంటల నుండి 12.30 గంటల వరకు పరిశీలించిన అనంతరం ఆర్డీవో ప్రకటన జారీ చేశారు. అవిశ్వాస సమావేశానికి హాజరైన ఎంపీపీ రాణి బాయి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు వెంటరాగ ఎంపీపీ రాణిబాయి స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసిన ఆనంతరం ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. దీంతో టిఆర్ఎస్ పార్టీలో కొనసాగిన రాణిబాయి త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వెళ్లడైంది.