మాజీ జెడ్పిటిసి జనార్దన్ రెడ్డి కన్నుమూత

మాజీ జెడ్పిటిసి జనార్దన్ రెడ్డి కన్నుమూత

శంకరపట్నం,ముద్ర జులై 10:శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన జాలి జనార్దన్ రెడ్డి(85) ఈరోజు తెల్లవారుజామున మరణించారు. జనార్దన్ రెడ్డి కరీంనగర్ లోని తన నివాసంలో సోమవారం తెల్లవారుజామున అస్వస్థకు గురై మరణించారు. భౌతికకాయాన్ని తన స్వగ్రామమైన కన్నాపూర్ గ్రామానికి తరలించారు. ఈయన గతంలో కన్నాపూర్ గ్రామానికి సర్పంచ్ గా,ఎంపిటిసిగా , తెలుగుదేశం పార్టీ హయాంలో శంకరపట్నం మండల జడ్పిటిసిగా పలు హోదాలలో సేవలు అందించారు . ఆయన మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.