ఆశ వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలి..

ఆశ వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలి..
  • బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి కీర్తి రెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి డిమాండ్ చేశారు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో గత పది రోజులుగా న్యాయమైన డిమాండ్ల కోసం ఆశా వర్కర్లు చేస్తున్న నిరవధిక సమ్మెకు బుధవారం ఆమె మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులు అని తేడా లేకుండా అన్ని వర్గాల వారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వారి ప్రాణలు సైతం వదులుకొన్నారని అన్నారు.

మన నిధులు, మన నియమకాలు మనకు జరుగుతాయని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటుందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఆశ వర్కర్లకు ఏవైతే న్యాయమైన డిమాండ్స్ అయిన పిఎఫ్ఐ సౌకర్యం, ప్రమాద బీమా ఐదు లక్షలు,  ప్రభుత్వ ఉద్యోగులకు ఏమేమి వర్తిస్తాయో అవన్నీ కూడా ఆశ వర్కర్లకు ఇవ్వాలని కోరారు.ఆశ వర్కర్లకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు మద్దతు ఉంటుందని వీళ్ళ హామీలు నెరవేర్చకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కోకన్వీనర్ చాడ రఘునాథ రెడ్డి, బిజెపి చిట్యాల మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు, కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు రాయిని శ్రీనివాస్, వేణు, తదితరులు పాల్గొన్నారు.