ఊరిస్తున్న ఉర్పీ

ఊరిస్తున్న ఉర్పీ


ఉర్పీ జావెద్ గురించి చెప్పాల్సిన పనిలేదు. డిజైనర్ దుస్తుల్లో హాట్ అప్పీరియన్స్ తో ఆకట్టుకోవడం అమ్మడి స్పెషాల్టీ. ప్రపంచంలోనే ఆమె అంత గొప్ప ఫ్యాషనిస్ట్ లేరు అనిపిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక డిజైనర్ దుస్తుల్లో కనిపిస్తుంది. వీటిని తనకోసం అంటూ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటుంది. ఎందుకంటే ఇలాంటి దుస్తులు కేవలం ఉర్పీ మాత్రమే ధరిస్తుంది.

ఆమె ఇలా కనిపించడానికి చాలా కారణాలే ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా తనకి బట్టలంటే ఎలర్జీ అని..శరీరం నిండుగా దుస్తులు ధరిస్తే రాషెస్ వచ్చేస్తాయని..అందుకే అలాంటి దుస్తుల్లో బయట తిరుగుతానని...తన ఇబ్బంది తనకు మాత్రమే తెలుసని ఓ సందర్భంలో వాపోయింది. అయితే ఈ కారణాన్ని చాలా మంది నమ్మలేదు.  ఉర్పీ విమర్శల నుంచి తప్పించుకోవడానికి అలా అబద్దాలు చెబుతుందన్నవారెంతో మంది.
అమెపై పోలీసులు కేసులు సైతం పెడతామని మహిళా అధ్యక్షరాళ్ల బెదిరింపులు సైతం ఎదుర్కోంది. అయినా ఉర్పీ తగ్గేదేలే నా ఇష్టం..నా జీవితం..నా ఒళ్లు అంటూ ఎప్పటికప్పుడు చెలరేగుతుంది.  తాజాగా ఇలా అమ్మడు స్కిన్ షో చేసింది. బ్లూ కలర్ సారీలో వయ్యారంగా కనిపించింది. ఆ చీర కేవలం బాటమ్ భాగంలో మాత్రమే. టాప్ లో నక్షత్రాల డిజైన్ తో కూడిన  బ్లౌజ్​ ధరించింది.. ఇక చేతికి చీర మ్యాచింగ్ గ్లౌసెస్ మోచేతి నుంచి వేళ్లు వరకూ ధరించింది. పాలనురుగుల తెలుపు పై ఆ చీర ధగధగ లాడిపోతుంది.