రకుల్‌ గ్లామర్‌ జోరు

రకుల్‌ గ్లామర్‌ జోరు


రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలలో నటించిన ఈ అమ్మడుకు.. ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలు రావట్లేదు. దీంతో ఈ భామ ప్రస్తుతం బాలివుడ్​లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. అయితే ఈ అమ్మడు పుట్టినరోజు సందర్భంగా తన స్నేహితులు, సన్నిహితుల నడుమ గ్రాండ్​గా ఆమె బర్త్​డే సెలెబ్రషన్స్ జరిగాయి. ఆ సెలెబ్రేషన్స్ ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బెస్ట్ ఫ్రెండ్స్ తో బెస్ట్ బర్త్​డ్. ఈ పుట్టిన రోజు ప్రత్యేకం చేసినందుకు ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. నాకు లవ్లీ విషెస్​ తెలిపిన ప్రతిఒక్కరికీ కూడా బిగ్ థ్యాంక్యూ అంటూ రాసుకొచ్చింది.  నటీమణులు మంచు లక్ష్మి, ప్రగ్యా జైశ్వాల్ కూడా ఈ సెలబ్రేషన్స్​లో పాల్గొని సందడి చేశారు. రకుల్ సిల్వర్ కలర్ టాప్​, జీన్స్ మిడ్డీ టైప్ ప్యాంట్​లో మెరిసింది. ఎంతో అందంగా కనిపించింది. బొకేలు పట్టుకుని నవ్వుతూ ఎంతో ఆనందంగా ఉంది.