పశుమిత్రలకు ప్రభుత్వం యూనిఫాం,మెడికల్ కిట్లు ఇవ్వాలి

పశుమిత్రలకు ప్రభుత్వం యూనిఫాం,మెడికల్ కిట్లు ఇవ్వాలి

ముద్ర ప్రతినిధి భువనగిరి:-పశుమిత్రులకు యూనిఫామ్, మెడికల్ కిట్స్ ఇవ్వాలని పసుమిత్రలను కార్మికులుగా గుర్తించి వారికి కనీస వేతనం ఇవ్వాలని తెలంగాణా పశు మిత్రుల యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .బుధవారం తెలంగాణ పసుమిత్రుల యూనియన్, యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఒక్క రోజు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పసమిత్ర యూనియన్ ( సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి మాట్లాడుతూ పసుమిత్రులు గత ఎనిమిది సంవత్సరాలుగా  సేవలందిస్తున్నారని వీరిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2700 మంది, జిల్లా వ్యాపితంగా 106 మంది సేవలు అందిస్తున్నారని, ఇందులో మహిళలే ఉన్నారని వీరికి ఐకెపి ద్వారా ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి పారితోషికాలు నిర్ణయించకుండా పశుమిత్రులుగా నియమించారని తెలియజేశారు. వీరికి తన ఊరుతో పాటు సబ్  సెంటర్ పరిధిలోని  జంతువులకు రాత్రనక, పగలనక సేవలు అందిస్తున్నారని ప్రయాణ సౌకర్యం కోసం ఎలక్ట్రికల్ బైక్ ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పసుమిత్ర యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు, సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ,తెలంగాణ పశు మిత్ర యూనియన్ ( సిఐటియు) జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు వరలక్ష్మి,బోడ భాగ్య ,జిల్లా ఉపాద్యక్షురాలు శ్రీలత,జిల్లా సహయకార్యదర్శి శిరీష , నాయకురాల్లు మనీషా, వసుధ, కవిత, అనిత, శ్రీదేవి,కావ్య,రామనుజమ్మ,నిర్మల, రమాదేవి,భవిత  పాల్గొన్నారు.