రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని మున్సిపల్ లో తీర్మానం

రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చాలని మున్సిపల్ లో తీర్మానం
  •  ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి పర్యవేక్షణలో ఆమోదం
  • హర్షం  వెలిబుచ్చిన భువనగిరి పట్టణ బి ఆర్ ఎస్  కమిటీ

ముద్ర ప్రతినిది, భువనగిరి:  భువనగిరి పురపాలక సంఘం కార్యాలయంలో గురువారం కౌన్సిల్ ప్రత్యేక సమావేశమం జరిగింది. భువనగిరి శాసనసభ్యులు  పైళ్ల శేఖర్ రెడ్డి  ఎక్స్ అఫిషియో మెంబర్ గా పాల్గొన్నారు.  చైర్మన్ ఎండబోయిన ఆంజనేయులు  అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనతో  భువనగిరి మున్సిపల్ పరిధిలో ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చి   రోడ్డును వేరే ప్రాంతం నుంచి నిర్మించాలని ఈ అంశంను ఏకగ్రీవంగా తీర్మానించారు.

గతంలో  రాయగిరి ప్రాంతంలో ఎన్ హెచ్ 163 రోడ్డు కు, కాలేశ్వరం ప్రాజెక్టు కాలువ కొరకు యాదగిరిగుట్ట రోడ్డు విస్తరణలో ప్రజలు భూమిని కోల్పోవడం జరిగింది కావున ఈ ప్రాంతం నుండి కాకుండా మరొక ప్రాంతం నుంచి రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్టును మార్చవలసిందిగా ప్రతిపాదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల కౌన్సిలర్లు పాల్గొన్నారు.  భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి ప్రాంత ప్రజల పక్షాన నిలిచి అలైన్మెంట్ మార్చడం కోసం ఏకగ్రీవ తీర్మానంకు ఆమోదం తెలిపిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కి , మునిసిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు ,  వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య కు మరియు అన్ని పార్టీల కౌన్సిలర్లకు బిఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఏవి కిరణ్ కుమార్,   రచ్చ శ్రీనివాస్ రెడ్డి లు  ఒక ప్రకటనలో అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.