మరిపడిగ లో తల్లి పాల వారోత్సవాలు

మరిపడిగ లో తల్లి పాల వారోత్సవాలు


గుండాల ఆగస్టు 04 (ముద్ర న్యూస్):-తల్లి పాలలో చాలా పోషకాలు ఉంటాయని చిన్న పిల్లలకు క్రమం తప్పకుండా తల్లి పాలు ఇవ్వాలని ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ యాక్ పాష బేగం అన్నారు.మరిపడిగ అంగన్ వాడి కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాల ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ 1991 ఫిబ్రవరి  ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు.మొత్తం 170 దేశాలలో ఈ తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుందని,ఈ తల్లిపాల వారోత్సవాలు కచ్చితంగా జరుపుకోవాలని అన్నారు. ప్రతి తల్లి డెలివరీ అవ్వగానే వెంటనే పాలు పట్టించాలని లేదా ఒక గంటలోపు పాలు పట్టించాలని, కేవలం తల్లిపాలు 6 నెలలు మాత్రమే ఇవ్వాలని అన్నారు, నవజాత మరణాలనేవి ఎక్కువగా జరుగుతున్నాయని ఆరు నెలల్లోపు పిల్లలు ఎక్కువగా చనిపోతున్నందున,సంవత్సరం లోపు పిల్లలు పోషకాహార లోపంతో ఎక్కువగా చనిపోతున్నారని, కేవలం 6 నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని 6 నెలలు దాటిన పిల్లలకు బలమైన పౌష్టికాహారం తో పాటు చిరుధాన్య లకు  తయారుచేసిన ఫుడ్ అందించాలని అన్నారు.ఈ 2023వ సంవత్సరంలో మన 32వ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో,అంగన్ వాడి టీచర్లు టి.కళమ్మ,కే స్వరూప,ఆశా వర్కర్లు వి భాగ్యమ్మ,జి కళమ్మ,కిశోర బాలికలు,గర్బనీ స్త్రీ లు,బాలింతలు పాల్గొన్నారు.