కాటారంలో గోరింటాకు వేడుకలు

కాటారంలో గోరింటాకు వేడుకలు

ముద్ర న్యూస్, కాటారం:జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో బుధవారం మహిళా సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఆషాడ మాసంలో మహిళలు గౌరీ దేవికి ప్రతిరూపంగా భావించే గోరింటాకును మహిళలు చేతులకు అందంగా అలంకరించుకుంటారు.చేతులకు ఎర్రగా పండితే కుటుంబంలో భర్త ప్రేమానురాగాలకు చిహ్నంగా నిలిచే ఈ గోరింటాకును కొన్ని ఏళ్లుగా కాటారం మండల కేంద్రంలో మహిళలందరూ  సామూహిక వేడుకలు నిర్వహించుకుంటారు. అందులో భాగంగానే ఆదివారం మహిళలందరూ స్థానిక ఫంక్షన్ హాల్లో సాంప్రదాయంగా గౌరీదేవికి పూజ నిర్వహించి ఇంటి నుండి ఒక్కొక్కరు తీసుకువచ్చిన గోరింటాకును ఒకరి చేతిపై మరొకరు గోరింటాకును వివిధ డిజైన్లు అలంకరించుకొన్నారు. బాగా పండిన చేతులను ఒకరికి ఒకరు ప్రదర్శనగా చూపించుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.గోరింటాకు బాగా పండిన చేతులుతో ప్రదర్శన నిర్వహించారు. అంతరం కిట్టి పార్టీలో భాగంగా పలు పోటీలను నిర్వహించారు.విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పవిత్రం నిర్మల,మద్ది శ్రీదేవి, బీరెల్లి పావని,మద్ది నీరజ, కముటాల రాధ,అనంతుల అనిత,చందా శోభ, శ్రీలక్ష్మిచౌదరి,కలికోట కల్పన తో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.