సెక్టార్ ఆఫీసర్లు పోలింగ్ స్టేషన్లలో అన్ని వసతులను పూర్తి చేసుకోవాలి

సెక్టార్ ఆఫీసర్లు పోలింగ్ స్టేషన్లలో అన్ని వసతులను పూర్తి చేసుకోవాలి
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే

ముద్ర ప్రతినిధి భువనగిరి :పోలింగ్ స్టేషన్లలో అన్ని వసతులను వెంటనే పూర్తి చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే సెక్టార్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం ఆయన 94- భువనగిరి, 97- ఆలేరు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన 64 మంది సెక్టార్ అధికారులకు విధులు, బాధ్యతలపై జరిగిన అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొని సెక్టార్ల వారిగా పోలింగ్ స్టేషన్లలో త్రాగునీరు, ర్యాంపులు, విద్యుత్ సౌకర్యం, వెబ్ కాస్టింగ్ కోసం అవసరమైన త్రీ పిన్ సాకెట్ల ఏర్పాటు, ఫాన్స్, టాయ్లెట్స్, ఫర్నీచర్, టెంట్ ల ఏర్పాట్లపై విపులంగా సమీక్షించారు. ఇంకా మిగిలిపోయిన పనులను త్వరిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

రూట్లపై అవగాహన ఉండాలని,  పోలింగ్ స్టేషన్లలో నెంబరు, నియోజక వర్గం నెంబరు సూచిస్తూ పెయింటింగ్ పనులు చేయడం జరిగిందని, ఇంకా ఎక్కడైనా మిగిలి ఉంటే వెంటనే పెయింటింగ్ పూర్తి చేయించాలని ఆదేశించారు. 80 సంవత్సరములు నిండిన వారికి, దివ్యాంగులకు 12D ఫారముల పంపిణీ చేయడం జరుగుతున్నందున ఇంకా అందని వారు ఉంటే గుర్తించి ఉంటే వెంటనే పంపిణీ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అలాగే పోలింగ్ రోజు జరిగే పోలింగ్ విధానంపై, ఇవిఎం యంత్రాలపై, సీలింగ్ చేసే విధానంపై, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఇచ్చే ఫారములు, కవర్స్, మెటీరియల్పై, మాక్ పోల్ విధానంపై, మాక్ పోల్ సర్టిఫికెట్ ఇచ్చే విధానంపై, పోలింగ్ సందర్భంలో వచ్చే టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు, టెస్ట్ ఓట్లపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు సందర్శించినప్పుడు  చేపట్టిన ఏర్పాట్లపై వారిపై  వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు ఎ.భాస్కరరావు, సెక్టార్ అధికారులు పాల్గొన్నారు.