కూచాద్రి సన్నిధిలో ఎమ్మెల్సీ శేరి పూజలు

కూచాద్రి సన్నిధిలో ఎమ్మెల్సీ శేరి పూజలు

ముద్ర ప్రతినిధి, మెదక్: రెండవ తిరుమలగా వెలుగొండుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హవేలి ఘనపూర్ మండలం కూచన్ పల్లి కూచాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  ఆలయ అర్చకులు స్వాగతం పలికి దర్శనం చేయించారు. ఎమ్మెల్సీతోపాటు గ్రామ సర్పంచ్ దేవగౌడ్, ఉప సర్పంచ్ బయన్న, గ్రామ కమిటీ అధ్యక్షులు తోగిట మల్లయ్య, గ వార్డ్ సభ్యులు యాదగిరి,  గ్రామ బిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. శోభకృత నామ సంవత్సరం ఉగాది పర్వదినం నుండి ఉత్సవాలు జరుగుతాయి