దేశానికి వెన్నెముక లాంటి వాడు రైతు.. రైతు శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ 

దేశానికి వెన్నెముక లాంటి వాడు రైతు.. రైతు శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ 

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : ఉగాది పండుగ సందర్భంగా  బండలాగుడు   పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే . ఈ రోజు జిల్లా  కేంద్రంలోని బీ.సీ కాలనీలో జయమ్మ కోటేష్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా  ఎద్దుల బండ లాగుడు  పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే ఎద్దుల పూజలు చేసి  ఎద్దుల బండ లాగుడు  పోటీలు లోను ప్రారంభించారు. 

ఎమ్మెల్యే మాట్లాడుతూ 
ప్రజలందరికీ శ్రీశోభ కృత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కొరకు అనేకమైన పథకాలను ప్రవేశపెట్టి నేరుగా ప్రజల లబ్ధి పొందే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల లబ్ధి పొందే విధంగా కృషి చేయడం జరుగుతుంది అదే విధంగా దాన్ని కులాలను గౌరవిస్తూ వారికి పూర్వ వైభోగం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా అహర్నిశలు ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది. ప్రతి ఇంటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి రైతుబంధు, 24 గంటల కరెంట్,  రైతు భీమా, ఇంటింటికి మంచినీళ్లు ఆసరా పింఛన్,  వంటి పథకాల అమలు చేయడం జరుగుతుంది. 

రైతుల కోసం రైతు సంబరాలను 
గతంలో లాగానే బండలా గుండు  పోటీలను ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకప్పుడు  దండగ అనుకునే వ్యవసాయం నేడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో తెలంగాణలో పండుగలా మారిందన్నారు. సీఎం కేసీఆర్. నాయకత్వంలో దేశం తెలంగాణ రాష్ట్రంలో పాటు దేశంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని లక్ష్యంతోనే బిఆర్ఎస్ పార్టీకి ఆవిష్కరించారు. అగ్లీ బార్ కిసాన్కా సర్కార్  అనే నినాదంతో  రైతుల శ్రేయస్సు కోసమే బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు కృషి చేస్తుందని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలు చేస్త్తున్న  ఘనత సీఎం కేసీఆర్‌ కే  దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్ మురళి, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షుడు గోవిందు, ఉపాధ్యక్షుడు ధర్మ నాయుడు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోటేష్, భగీరథ వంశీ, కురుమన్న, అన్వర్, సీతారాములు, వీరేష్, రాజు, నాయకులు, రైతులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు