గ్రూప్-1పరీక్షను రద్దు చేయాలి: బీజేపీ

గ్రూప్-1పరీక్షను రద్దు చేయాలి: బీజేపీ

ముద్ర ప్రతినిధి, జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా  కార్యాలయం డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి. మాట్లాడుతూ. 2014 నుంచి 2023 వరకు నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపించిన కేసీఆర్.ఇప్పుడేమో లీకేజీ ల బాగోతం. మీరు చేసిన చేస్తున్న తెలివి తక్కువ పనుల వలన నిరుద్యోగుల కల కలగానే మిగిలేటట్టు వుంది, మీరు నిర్వహించిన గ్రూప్-1పరీక్షను రద్దు చేయాలని మా బీజేపీ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము.ఈ వ్యవహారం లో కల్వకుంట్ల కుటుంబ పాత్ర ఉంది కాబట్టే సిట్ విచారణ అంటూ కాలయాపన చేయడానికి వారి కనుసన్నల్లో నడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తతంగం అంతా కూడా  ఒక సిట్టింగ్ జడ్జి తో  విచారణ కు అదేశాలివ్వాలని  బీజేపీ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నామని జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి. తెలియజేసారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత  మీ అనుచరుల కు ఏ క్వాలిఫికేషన్ లేకున్నా  రాజకీయ నిరుద్యోగులంటూ అందలమెక్కించి లక్షల రూపాయల జీతాలిచ్చి మీ అనుచరులగా మీ వెంట తిప్పుకుంటున్నారు, మీ అవగాహన లేని పాలన వలన  తెలంగాణ లో నిరుద్యోగులకు నిలవ నీడ లేకుండాపోయింది. మీ అస్తవ్యస్త పాలనతో 9 ఏళ్లలో జరిగిన అవమానాలు, ఆత్మహత్యలు, ఎన్నో ఎన్నెన్నో.ఇంటికో ఉద్యోగం అంటూ ఉద్యమ సమయం లో చెప్తే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు నమ్మి  ఈ తెరాస కు ఓటేస్తే 9 ఏళ్ళు  గా నిరుద్యోగులు మోసపోతున్నారు.మీరు చెప్పిన హామీలు తెలంగాణ ప్రజలు అడుగుతుంటే మిరేమో మీ రాజకీయాల కోసం మీ అక్రమ సంపాదన కోసం మీ కుటుంభం మొత్తం వెంపర్లాడుతుంది, నిరుద్యోగులు మాత్రం నోటిఫికేషన్ లు వస్తాయి అని కుటుంబాన్ని వదిలి భాగ్యనగరం లో కోచింగ్ సెంటర్ లలో కోచింగ్ తీసుకుంటూ  ఒక పూట పస్తులుండి, జేబులో డబ్బుల్లేక నానా ఇబ్బందులు పడి ఉద్యోగం సాధించాలని తపనపడుతుంటే మిరేమో నోటిఫికేషన్ లు వేసినట్టే వేసి,మీ వాళ్లనే కోర్ట్ కు పంపి, తాత్సారం చేస్తున్నారు, తెలంగాణ ను జోన్ వారిగా విభజించి దానికి కూడా ఏదో  ఒక కోండి తగిలించి నోటిఫికేషన్ లలో ఇబ్బంది పెడుతున్నది వాస్తవం కాదా ముఖ్యమంత్రి కేసీఆర్. అని ప్రశ్నించారు జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి.

తెలంగాణ వచ్చినాక ఉద్యోగుల ను, నిరుద్యోగులను వేధిస్తోంది నిజమా కాదా మీరు చేస్తున్న ఒంటెద్దు పోకడలతో వారంతా ఇబ్బంది పడుతున్న ఒక్క రోజు కూడా వారి సమస్యల పై సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నిస్తున్నాము అని ముఖ్యమంత్రి కేసీఆర్ ని నిలదీశారు జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి. ఇప్పటికైనా ఉద్యోగస్తుల సమస్యలు,నిరుద్యోగుల సమస్యల పై స్పందించకుంటే వారి తరపున రాష్ట్ర బీజేపీ పార్టీ అండగా ఉంటుందని వారి తరపున ఎంతటి త్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాము, మీరు నియంత ల వ్యవహరిస్తున్న విషయాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు.ఇంటికో ఉద్యోగం అన్నారు ప్రతి ఇంటిని మోసం చేశారు.వి ఆర్ ఓ లను మోసం చేశారు.2008 లో డిస్సీ సెలెక్ట్ అయిన ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తామని మోసం చేశారు. నియోజకవర్గ ముకు ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని మోసం చేశారు. 6 నెలలకు ఒకసారి టెట్ వేస్తామని మోసం చేశారు.ఒక లక్ష ఉద్యగాలకు నోటిఫికేషన్లు వేస్తామని అసెంబ్లీ సాక్షిగా మోసం చేశారు. 2021 లో ఇంటర్ విద్యార్థులు ఎక్సామ్ లలో మార్కులలో తప్పు జరిగితే వాటి వలన విద్యార్థులు చనిపోతే ఆ సమస్య పరిష్కరిస్తామని మోసం చేశారు. ఫీజు రిఎంబర్స్ మెంట్ యధావిధిగా అమలు చేస్తామని మోసం చేసిండు. నిరుద్యోగ భృతి ఇస్తా అంటూ గత 4 ఏళ్లుగా మోసం చేస్తుండు.లీకైన జూనియర్ లైన్ మెన్ ల ప్రశ్న పత్రం. పోలీసు ఉద్యోగుల నిబంధనలు మార్చి వారిని ఇబ్బందికి గురి చేసింది వాస్తవం కాదా దీని వలన కొంతమంది ఆత్మహత్య చేసుకుంది వాస్తవమే కదా ముఖ్యమంత్రి. పరీక్షల తేదీల నిర్వహణలో కూడా అలసత్వం నిజం కాదా.2015 లో సింగరేణి ఉద్యగాల్లో తికమకకు గురి చేసింది నిజం కాదా. జూనియర్ అసిస్టెంట్  గ్రేడ్-2 నియామకాల్లో కూడా ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా.ఈ పోస్టుల ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తూ గోవా లో పరీక్షలు రాయించారు అన్న ఆరోపణలు వచ్చిన కూడా మీరు స్పందించక పోవడం నిజమే కదా కేసీఆర్.కేజీ టు పీజీ ఉచిత విద్య మోసం.మీరు నోటిఫికేషన్ లు వెయ్యనందుకు నిరుద్యోగులకు వయసు దాటిపొయ్యి ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నారు అన్నది వాస్తవం కాదా. ఈ లీకేజీ మాఫియాతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి టి యస్ పి యస్ సి మొత్తం ఒక ట్రాష్ చేసేసి, దానికి చైర్మన్ ను ఒక బొమ్మ చేసి కొత్త కొత్త నాటకాలు ఆడించి నిరుద్యోగులను తికమక చేస్తూ టి యస్ పి యస్ సి లో ఉద్యోగస్తులను ఉత్సవ విగ్రహాలను చేసి ఆడిస్తున్నది నిజం కాదా కేసీఆర్. ఉద్యోగస్థుల క్యాలెండర్, నిరుద్యోగ క్యాలెండర్ వేసి ఒక క్రమపద్ధతిలో అందరికి న్యాయం చేస్తామని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, వేస్తా అన్న నోటిఫికేషన్లు ఆపింది నిజం కాదా కేసీఆర్.మీ మాట నమ్మి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలంతా మీకు వెన్నంటి ఉండి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తే మీరేమో మీ కుటుంబానికి నీళ్లు, నిధులు, నియామకాలను అందించి తెలంగాణ ప్రజల బాధలను చూస్తూ రాక్షసనందం పొందుతూ దేశ రాజకీయాలు అంటూ తెలంగాణ ప్రజల నుంచి తప్పించుకుంటున్నది వాస్తవం కాదా  ముఖ్యమంత్రి కేసీఆర్, మీ సమాధి మీరే తవ్వుకుంటున్నారు కేసీఆర్. మీకు తెలంగాణలో వుండే అర్హత ను కోల్పోయారు మీకు ఈ ప్రాంత ప్రజలు బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ హెచ్చరించారు