ఈత సరదా విషాదం కాకూడదు:డి.ఎస్పి ఎన్. సిహెచ్. రంగస్వామి

ఈత సరదా విషాదం కాకూడదు:డి.ఎస్పి ఎన్. సిహెచ్. రంగస్వామి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి గద్వాల డిఎస్పి. గద్వాల వేసవికాలంలో విద్యార్ధులకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ  వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి   జలాశయాల వద్దకు ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని గద్వాల జిల్లా డి.ఎస్పి ఎన్. సిహెచ్. రంగస్వామి హెచ్చరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ కార్యాలయం నుండి సోమవారం ప్రకటన చేసారు.ఈ సందర్భంగా డి.ఎస్పి ఎన్. సిహెచ్. రంగస్వామి, మాట్లాడుతూ.

ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఈత  నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని, ముఖ్యముగా తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాలు, చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జిల్లా పోలీసు,  గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జలాశయాల వద్ద హెచ్చరిక  సూచికలను ఏర్పాటు చేసి  రానున్న కాలంలో ఎటువంటి ప్రమాదాలు  జరగకుండా చర్యలు తీసుకుంటామని డి.ఎస్.పి పేర్కొన్నారు.