రైతులను ఆదుకుంటాం దెబ్బతిన్న పంటలు పరిశీలించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి

రైతులను ఆదుకుంటాం దెబ్బతిన్న పంటలు పరిశీలించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి

ముద్ర ప్రతినిధి, మెదక్: ఈదురు గాలులతోపాటు వడగళ్ల వానతో దెబ్బతిన్న వరి పంటలను ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జిల్లా అదును కలెక్టర్ రమేష్ తో కలిసి బుధవారం పరిశీలించారు. హవేలీ ఘనాపూర్ మండలం కూచన్ పల్లిలో అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి బాధిత రైతులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి భరోసానిచ్చారు. అనంతరం మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాదిత కుటుంబాలను పరామర్శించారు.  గౌడి వెంకటి, ఏసయ్య, యాదయ్యల ఇళ్లు దగ్ధం కావడంతో అందులో ఉన్న బైక్ టీవీ ఇతర సామాన్లు కాలి బూడిదయ్యాయి.

పంట కోసే సమయానికి అకాల వర్షం వలన పంట నష్టం జరిగిందన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అందర్నీ ఆదుకుంటుందని చెప్పారు, మెదక్ నియోజకవర్గంలో సాయంత్రం వరకు ఎంత నష్టం వచ్చిందని అధికారుల ద్వారా రిపోర్టు తీసుకుని  ముఖ్యమంత్రి,మంత్రి  దృష్టికి తీసుకెళ్తానన్నారు. తక్షణ సహాయం కింద ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు పంట నష్ట పరిహారం అందజేస్తారన్నారు