పోలీసుల వాహనాల తనిఖీలో ఘర్షణ విద్యుత్ తీగలు ముట్టుకోవడంతో యువకుడు మృతి

పోలీసుల వాహనాల తనిఖీలో ఘర్షణ విద్యుత్ తీగలు ముట్టుకోవడంతో యువకుడు మృతి

విద్యుత్ తీగలు ముట్టుకోవడంతో యువకుడు మృతి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో ఖదీర్ ఖాన్ సంఘటన చల్లారక ముందే పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ యువకుడు పోలీసులతో ఘర్షణ పడి పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను ముట్టుకోవడంతో మృతిచెందిన సంఘటన వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ వద్ద  చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి...శుక్రవారం వెల్దుర్తి ఎఎస్ఐ వాసురాం ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీ, డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. ఆ సమయంలో చిన్న శంకరంపేట మండలం ఎస్. కొండాపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్ (25) అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చాడు.

వాహన తనిఖీ చేయగా మద్యం మత్తులో ఉన్న యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. పోలీసులు వారిస్తున్నప్పటికీ వెళ్లి పక్కనే ఉన్న సింగల్ఫేస్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలు పట్టుకున్నాడు. తీవ్రంగా గాయపడిన సాయిరాంను వెంటనే  తూప్రాన్ ఆసుపత్రికి తరలించగా ఆప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. తుప్రాన్ సిఐ శ్రీధర్, వెల్దుర్తి ఎస్ఐ మధుసూదన్ గౌడ్ ఆసుపత్రికి వచ్చారు.