ప్రీతిని సైఫ్ వేధించడం నిజమే

ప్రీతిని సైఫ్ వేధించడం నిజమే
  • ఉద్దేశపూర్వకంగానే వేధింపులు
  • వాట్సాప్ ఆధారాలున్నాయి వరంగల్ సీపీ రంగనాథ్

ముద్ర ప్రతినిధి, వరంగల్: ప్రీతిని సైఫ్ వేధించడం నిజమేనని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రీతి చాలా సెన్సిటివ్ ఆమె ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడన్నారు. ఈ కారణంగానే ప్రీతికి సహకరించవద్దని తన స్నేహితులకు చెప్పాడని శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రీతిని సైఫ్ ఉద్దేశపూర్వకంగానే వేధించాడని తెలిపారు. ప్రీతి నవంబర్ లో అడ్మిషన్ తీసుకుంటే సైఫ్ డిసెంబర్ నుంచి వేధించడం ప్రారంభినట్లు తెలిపారు. ప్రీతికి నేర్పించే క్రమంలో గట్టిగా చెబుతున్నానని సైఫ్ వాదిస్తున్నాడని, కానీ మొదట నుంచి సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బంది పడుతూ వచ్చిందని ఆయన వివరించారు. ప్రీతిని టార్గెట్ చేస్తూ వాట్సాప్ గ్రూపులో సైఫ్ వేధించాడన్నారు. తన ఫ్రెండ్స్ తో కూడా ప్రీతి ఎక్కువ చేస్తున్నట్లుగా చెప్పినట్లు తెలిపారు. తనను ఎందుకు వేధిస్తున్నావంటూ ప్రీతి, సైఫ్ కి మెసేజ్ కూడా చేసిందన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతి గురించి అవమానకర పోస్టులు పెట్టాడన్నారు. గ్రూపులో పోస్టు పెట్టి తనను అవమానపరచవద్దని సైఫ్‌ని ప్రీతి వేడుకుందన్నారు. తనను అవమానపరిచావని సైఫ్‌తో ప్రీతి చెప్పిందని, ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకురావాలని ప్రీతి కోరిందని వెల్లడించారు. సైఫ్ తన ఇతర మిత్రులతో కలిసి వాట్సాప్‌లో ప్రీతిని వేధించినట్టు తేలిందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. 20న తేదీన సైఫ్ వేధింపుల గురించి ప్రీతి తన తండ్రికి చెప్పిందన్నారు.

21న ప్రీతి, సైఫ్‌తో కాలేజీ యాజమాన్యం విచారించిందని తెలిపారు. అయినప్పటికీ సైఫ్ తగ్గకపోవడంతో మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసిందని వెల్లడించారు. ప్రీతి మానసికంగా ఇబ్బంది పడినందువల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. ఘటనా స్థలంలో సక్సీ నైల్ కోలిన్ అనే ఇంజక్షన్ దొరికిందని, గూగుల్ లో ఈ ఇంజక్షన్ గురించి ప్రీతి సెర్చ్ చేసిందన్నారు. ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ తీశామని, టాక్సికాలజీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.  ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సైఫ్ వేధింపులే కారణంగా ప్రాథమికంగా నిర్దారణకు వచ్చినట్లు సీపీ వెల్లడించారు. ఈ ఘటనలో పోలీస్ రియాక్ట్ కాలేదన్నది అవాస్తవమన్నారు.  పోలీసులను హెల్ప్ కావాలని ప్రీతి తండ్రి తనకున్న సంబంధాలతో

ఓరల్ గా అడిగారన్నారు.  ప్రీతి తండ్రిని అడిగితే పోలీస్ రియాక్ట్ అయ్యారని చెప్పినట్లు తెలిపారు. ర్యాగింగ్ అనేది ఇక్కడ చూడకూడదని, బాసిజమ్  అనేదే ఇక్కడ ప్రధానంగా చెప్పారు. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో మాట్లాడాలన్నారు. ఈ ఘటనలో పోలీస్ పరంగా ఎలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేసారు. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్‌ను అరెస్ట్ చేశామని.. దీనిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశామని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు.