ప్రీతి మృతికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే భరించాలి

ప్రీతి మృతికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే భరించాలి

ముద్ర, వీణవంక: వరంగల్ మెడికల్ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రీతి మృతికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, వారి తల్లిదండ్రుల పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని వారన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చదువు జైపాల్ రెడ్డి, ఈదునూరి పైడి కుమార్, ఎండి రషీద్, కోమాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఎండి సలీం, గట్టయ్య ,సంపత్ రెడ్డి, సుకాశి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.