జాడ లేని ఝాన్సీ రెడ్డి 

జాడ లేని ఝాన్సీ రెడ్డి 
  • కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సహం
  • కండువా కప్పుకున్న రెండు రోజులకి కన్పించని వైనం 
  • డైనామాలో కాంగ్రెస్ కార్యకర్తలు , లీడర్లు 
  • పాలకుర్తి లో పరామర్శలకు దూరంగా ప్రతిపక్షం

ముద్ర, వర్థన్నపేట: పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఢీకొట్టడం  కోసం కాంగ్రెస్ టిపిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి భారీ వ్యూహలు రచిస్తున్నడని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ సాగింది.ఈ నేపథ్యంలోనే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఖమ్మం సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆమె పాలకుర్తి లో పోటి చేస్తారనే టాక్ వినిపించింది.దింతో గత కోన్ని రోజులుగా పాలకుర్తి సెగ్మెంట్ లో సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లలో ఉత్సాహం మరింత రెట్టింపైంది.పార్టీ తీర్థం పుచ్చుకున్న రెండు రోజులకు ఝాన్సీ రెడ్డి నియోజకవర్గంలో కనిపించకపోవడంతో కార్యకర్తలు లీడర్లు డైనామాలో పడినట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి ని డీకొట్టే  సరైన నాయకుడు లేడని నిత్యం ప్రజల్లో ఉంటాడని  ప్రతిపక్షంలో ఉన్న లీడర్లు మీడియా ముఖంగా చెబుతుడటం కాంగ్రెస్ కార్యకర్తలను నిరుత్సాహానికి గురి చేసినట్లు తెలుస్తోంది...దీంతో 15రోజులు పాలకుర్తి లో హల్చల్ చేసిన ఝాన్సీ ఒక్కసారిగా సైలెంట్ అవ్వడంతో పాలకుర్తి  ప్రజల్లో పలు అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి.

  • జాడలేని ఝాన్సీ రెడ్డి :

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పాలకుర్తి నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో పంటనష్టంతో పాటు కోంత మంది ఇండ్లు కూలిపోయి ఆస్తినష్టం వాటిల్లింది.ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో నిలవనున్న ఝాన్సీ రెడ్డి ప్రజల మధ్య లేకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె తీరుపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.రాష్ట్రంలో మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వరదల వచ్చిన సమయంలో పాలకుర్తి లోని అన్ని మండలాల్లో సుడిగాలి పర్యటన చేసి ప్రజలకు ధైర్యం చెప్తూ నమ్మకం కలిగేలా చేశాడు.

  • డైనామాలో కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లు:

ఝాన్సీ రాకతో పాలకుర్తి నియోజకవర్గం లో మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి లో కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయవచ్చనీ ధీమాతో ఉన్న కార్యకర్తలు లీడర్లు డైనామాలో పడినట్లు తెలుస్తోంది.ఏధైమైనప్పటికి ప్రతిపక్షంలో ఉన్న ఝాన్సీ రెడ్డి  ప్రజలతో మమేకమై కార్యకర్తల్లో, లీడర్లలో నమ్మకం కలిగిస్తుంది లేదో వేచి చూడాల్సిందేననీ పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.