ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అర్హులను నియమించాలి

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అర్హులను నియమించాలి
  • డి పి ఆర్ ఓ కు వినతి పత్రం అందించిన టియుడబ్ల్యూజే నాయకులు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: జిల్లా పోరా సంబంధాల శాఖ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో  అర్హత కలిగిన వారిని నియమించాలని డిపిఆర్ఓ కు టీయూడబ్ల్యూజే హెచ్ 143 ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రం అందించారు. జిల్లా పోరా సంబంధాల శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డిపిఆర్ఓ, కెమెరా, వీడియో గ్రాఫర్లను నియమించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారు తెలిపారు. అర్హత కలిగిన వారిని కాకుండా ఇతరులకు అట్టి ఉద్యోగాలను కట్టబెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని అర్హులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. డి పి ఆర్ ఓ మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు, రాష్ట్ర నాయకులు నాయకులు అబ్దుల్లా ఖాన్,శ్రీనివాస్ గౌడ్,జిల్లా కార్యదర్శి రాజేష్ గౌడ్,రాజేష్,కృష్ణ,బాలస్వామి, సాజిద్ , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.