ప్రజల వద్ద సేకరించిన నాణాలతో డిపాజిట్ ఫీజు కట్టిన  బీఎస్పీ పార్టీ కుమార్ 

ప్రజల వద్ద సేకరించిన నాణాలతో డిపాజిట్ ఫీజు కట్టిన  బీఎస్పీ పార్టీ కుమార్ 

నాగర్ కర్నూల్ : బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి కుమార్ ప్రజల వద్ద సేకరించిన నాణాలతో డిపాజిట్ ఫీజు కట్టి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి నామినేషన్ వేయడానికి వెళ్లిన ఆయన మీడియా పాయింట్ వద్ద నామినేషన్ వేసేందుకు ప్రజల వద్ద కూడగట్టిన ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలను లెక్కపెట్టుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన తాను ప్రజలకు ఓటు, ఎన్నికల ఖర్చు కోసం నోటు ఇవ్వమని కోరమన్నారు. ప్రజలు ఇచ్చిన చిల్లర నాణాల తోనే డిపాజిట్ ఫీజు చెల్లించి, నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ వేయడానికి డబ్బులు ఇచ్చిన ప్రజలే ఓటు కూడా వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. నాగర్ కర్నూల్ అభివృద్ధిలో నోచుకోలేదని గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం పేదలకు ఏమి చేయలేదని తీవ్రంగా విమర్శించారు‌ ప్రజల మధ్య ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని, డబ్బుకు మద్యానికి అమ్ముడు పోవద్దన్నారు. ఓటును సద్విజయంగా చేసుకోవాలని కోరారు.