నామినేషన్ ర్యాలీలో అపశ్రుతి !! 

నామినేషన్ ర్యాలీలో అపశ్రుతి !! 

                     

  • ప్రచార రథం నుంచి కింద పడిన కేటిఆర్                                  

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది.  ప్రచార రథంపై  మంత్రి కేటీఆర్ తో కలిసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రచారం రథం వెళ్తుండగా కరెంట్ వైర్ అడ్డు రావడంతో డ్రైవర్ ఒకేసారి బ్రేక్ వేశారు. దీంతో రేలింగ్ విరిగిపోయి కేటీఆర్ ముందుకు పడిపోయారు. ఇక ఇదే ప్రచార రథంపై ఉన్న రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి కింద పడిపోయారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కేటీఆర్ ను  పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.