ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా బ్యాలెట్ యూనిట్ల ర్యాన్డమైజేష్ :కలెక్టర్

ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా బ్యాలెట్ యూనిట్ల ర్యాన్డమైజేష్ :కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:జుక్కల్ నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున అదనంగా కావలసిన  బ్యాలెట్ యూనిట్లకు గాను స్పెషల్ ర్యాండమైజేషన్ ద్వారా పారదర్శకంగా కేటాయించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ తో కలిసి   వివిధ రాజకీయ పార్టల ప్రతినిధుల సమక్షంలో ఆన్ లైన్ సాఫ్ట్ వెర్ సిస్టం ద్వారా ర్యాండమైజేషన్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  బ్యాలట్  యూనిట్ల పంపిణీలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్నికల కమీషన్  ప్రత్యేక సాఫ్ట్ వెర్ ద్వారా ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టిందని,  తద్వారా ఏ బ్యాలట్ యూనిట్, వి.వి.ఫై. ఫ్యాట్ ఎక్కడికి  వెలుతుందో  ఎవరికీ తెలియదని అన్నారు.

కట్టుదిట్టమైన భద్రత మధ్య జుక్కల్ నియోజక వర్గానికి తరలించి అక్కడ శనివారం రాజకీయ పక్షాల సమక్షంలో పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారన్నారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఈ నెల 21,22 తేదీలలో యంత్రాల నిర్వహణ  మాక్ పోలింగ్ పై శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు.23,24 తేదీలలో ఈ.వి.ఏం. వివి ఫ్యాట్ ల కమీషనింగ్ చేస్తామన్నారు.   10 పోలింగ్ బూతులకు  ఒక సెక్టోరల్ అధికారులను నియమించామని, వారు  యంత్రాల నిర్వహణ తీరును, సమస్యలను పరిష్కరిస్తారన్నారు.  29 న డిస్ట్రిబ్యూషన్ రోజు యంత్రాల నిర్వహణ పై  ఏవైనా సందేహాలుంటే తెలియపరుస్తారని కలెక్టర్ చెప్పారు.ఈ కార్యక్రమంలో వివిజా రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల పర్యవేక్షకులు పాల్గొన్నారు.