పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఐసిడిఎస్ సూపర్వైజర్ జయలలిత, గ్రామ సర్పంచ్ గా. వెంకటేశ్వర్ రెడ్డి.
 ముద్ర ప్రతినిధి,నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో కస్తూర్బా బాలికల పాఠశాలలో శుక్రవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చిరుధాన్యాల గురించి బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా  ఐసిడిఎస్ సూపర్వైజర్ జయలలిత, ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ గా. వెంకటేశ్వర్ రెడ్డి బాలికలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపర్వైజర్ అన్నారు.
చిరుధాన్యాలతో పోషకాహారం తయారుచేసుకొని రోజు తినాలని ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలతో తయారుచేసిన వంటలు ఆకుకూరలతో వండిన రాగులు, సజ్జలు,కొర్రలు,ఆర్కలు ,సామలు, ఊదులు ,ప్రతిరోజు మొలకెత్తిన గింజలను ఉదయం తినాలని ఆరోగ్యంగా ఉండాలని ఆమె తెలిపారు. రక్తహీనత గురించి కిశోర బాలికలకు అవగాహన కల్పించారు .ప్రతిరోజు యోగా ఉదయం చేయాలని ఆరోగ్యంగా ఉండాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ నాగశేషి ,కస్తూర్బా ప్రిన్సిపల్ లత ,గ్రామపంచాయతీ వార్డు నెంబర్ రావుల శ్రీనివాస్ రెడ్డి ,అంగన్వాడి టీచర్ బి జ్యోతి ,ఏఎన్ఎంలు ,ఆశ వర్కర్ ,అంగన్వాడీ టీచర్లు కస్తూర్బా గురుకుల పాఠశాల విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు...