తెలంగాణ భరోసా సభను విజయవంతం చేద్దాం బిఎస్పీ

తెలంగాణ భరోసా సభను విజయవంతం చేద్దాం బిఎస్పీ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:  బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో మే7వ తేదీన జరగనున్న తెలంగాణ భరోసా సభ గోడ పత్రికలు, కరపత్రాలు విడుదల చేశారు. ఇ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కారంగి బ్రహ్మయ్య మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అవిశ్రాంతంగా పోరాడుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవితాలతో 9ఏండ్ల నుంచి చెలగాటం ఆడుతూ, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం అంటే ప్రజల జీవితాలను ఏద్దేవా చేయడమే అనీ విమర్శించారు. అందుకే మే7వ తేదీన తెలంగాణ భరోసా సభను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇ సభకు ముఖ్య అతిధిగా బిఎస్పీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సోదరి కుమారి మాయావతి వస్తున్నట్టు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు మే 7వ తేదీన స్వచ్ఛందంగా తరలి వచ్చి, తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాలనీ పిలుపు నిచ్చారు.

ఇ కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ తెలంగాణను ఉద్దరించని ముఖ్యమంత్రి కెసిఆర్, మహారాష్ట్రను ఉద్ధరిస్తానని చెప్పడం హాస్యాస్పదం అనీ పేర్కొన్నారు. బహుజనులు అంతా ఏకమై రానున్న ఎన్నికల్లో బహుజన రాజ్యం సాధించుకుందామని కోరారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు 70ఎమ్మెల్యే టికెట్స్ కేటాయించే ఏకైక పార్టీ బిఎస్పీ మాత్రమే అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో మాయావతి తన పాలనలో పేదలకు 7లక్షల ఎకరాల భూమిని పంచి ఇచ్చిందని, రాబోయే బహుజన రాజ్యంలో పేదలకు 1ఎకరం భూమి పంచి ఇస్తామని తెలిపారు. తెలంగాణ భరోసాను సభను విజయవంతం చేయాలనీ కోరారు. ఇ కార్యక్రమంలో కొల్లాపూర్ అసెంబ్లీ అధ్యక్షులు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ప్రకాష్, నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇంచార్జ్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, నాయకులు కళ్యాణ్, కురుమయ్య, పర్వాతలు, వెంకటేష్, మబ్బు రాము లు పాల్గొన్నారు.