పోతుగంటి రాములు దారి ఎటు వైపు

పోతుగంటి రాములు దారి ఎటు వైపు
  • పార్టీకి దూరంగా ఉంటున్న తండ్రి కొడుకులు
  • సీఎం సభలకు సైతం డుమ్మా
  • ఎంపీ రాములు పార్టీ మార్పుపై నియోజకవర్గంలో జోరుగా చర్చ
  • మౌనం వీడని ఎంపీ రాములు

ముద్ర, అచ్చంపేట:నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.గత కొన్ని  రెండు సం వత్సరాలుగా ఎంపీ రాములు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్యన పచ్చగడ్డి వేస్తే మాడిపోయే స్థితి ఉంది. ఎంపీ రాములు అచ్చంపేట ఎమ్మెల్యేగా స్వర్గీయ పి మహేందర్ నాథ్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన తిరుగులేని శక్తిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఎంపీ రాములు కాంగ్రెస్ మధ్య గతంలో ఎన్నికలు పలుమార్లు జరిగిన ఎలాంటి తీవ్రమైన ఘర్షణలు జరగకుండా రాజకీయ బద్ధంగానే ఎన్నికలు సజావుగా జరిగేవి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో అచ్చంపేట నియోజకవర్గానికి వచ్చిన వనపర్తి జిల్లా గోపాల్ పేట  మండలం పోల్కేపాడు గ్రామానికి చెందిన గువ్వల బాలరాజు నియోజకవర్గానికి వలస వచ్చి ఉద్యమంలో కీలకంగా టిఆర్ఎస్ పార్టీ తరఫున పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 2014న సిద్ధించిన తర్వాత మొట్టమొదటిసారి జరిగిన శాసనసభ ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికలలో తిరిగి ఎన్నికల నిర్వహించగా రెండవసారి అచ్చంపేట నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించి ప్రభుత్వ విప్ గా  కొనసాగుతున్నారు. అయితే అచ్చంపేట ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం దానికి తోడు నియోజకవర్గంలో సౌమ్యునిగా మంచి గుర్తింపు ఉన్న నేత ఎంపీ రాములు.రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు వన్ మెన్ ఆర్మీగా నియోజకవర్గంలో చలామణి అవుతూ ద్వితీయ శ్రేణి నాయకున్ని ఎదగనీయకుండా అన్ని తానై నడిపిస్తూ వస్తున్నారు.

గత రెండు సంవత్సరాల క్రితం ఎంపి ఎమ్మెల్యే మధ్యన ప్రచ్చన్న యుద్ధం చోటు చేసుకుంటూ వస్తుంది. నియోజకవర్గం లో ఎంపీ రాములు,ఆయన తనయుడు భారత్ ఫోటోలను సైతం పెట్టకుండా నియంత్రిస్తూ ఎంపీ రాములు వెంట క్యాడర్ లేకుండా చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఒక స్థాయిలో ఎంపీ తనయుడు ప్లెక్సీ విషయంలో జరిగిన గొడవ పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద రచ్చ జరిగింది. ఈ విషయం అధిష్టానం దృష్టికి అప్పట్లో వెళ్లిన ఇద్దరు మధ్యన కొంత సయోధ్య కుదిరించినట్లు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే గువ్వల- ఎంపీ రాములు మధ్యన సయోధ్య మాత్రం కుదరడం లేదని చెప్పవచ్చు. 2023 సాధారణ ఎన్నికలు రాగానే ఎమ్మెల్యే తనదైన శైలిలో సీఎం కేసీఆర్ దగ్గర ఉన్న సాన్నిహిత్యం తో మూడవసారి ఎమ్మెల్యేగా టికెట్ ను  సాధించి నియోజకవర్గంలో మూడవసారి పాగా వేసేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. అయితే ఎంపీ ఎంపీ వర్గం నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి పెద్ద మొత్తం లో  కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరారు. ఇటీవల ఉప్పునుంతల మండలానికి చెందిన ఎంపీపీ, జడ్పిటిసి, చారకొండ మండల జడ్పిటిసి సభ్యులు జెడ్పి వైస్ చైర్మన్ సైతం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నాటి నుండి నియోజకవర్గంలోని అమ్రాబాద్ లింగాల ఉప్పునుంతల బలమూరు అచ్చంపేట పదరా వంగూరు మండలాల్లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటూ ఉన్నారు. దీంతో బి ఆర్ ఎస్ కేడర్ అయోమయంలో పడిపోయింది. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నియంత పోకడ కు విసిగి వేసారి ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరుతా ఉన్నారు అనేటువంటి గుసగుసలు నియోజకవర్గంలో వినిపిస్తా ఉన్నాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజును మూడవసారి గెలిపించేందుకు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎంపీ రాములు నియోజవర్గానికి వెళ్లి బాలరాజు గెలుపు కొరకు కృషి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అయితే అందుకు ఎంపీ రాములు వెళ్లడానికి విముకత చూపినట్లు విశ్వసనీయ సమాచారం. 2014 నుండి బాలరాజు క్యాడర్ అంటూ ఏమీ లేదు కానీ మొత్తం తెలుగుదేశం పార్టీ నుండి ఎంపీ వర్గం టిఆర్ఎస్ పార్టీలోకి చేరడంతో టిఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు నిండిపోయారు. అయితే ఇటీవల ఎమ్మెల్యే పై ఉన్న అనాసక్తి కి తోడు పెద్ద ఎత్తున నియోజకవర్గం లో నాయకులు పార్టీ మారుతుండడంతో టిఆర్ఎస్ క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. ఎంపీ రాములు ఆయన తనయుడు భరత్ సైతం ఇటీవల పార్టీ మారాలని సొంత పార్టీ నుండే పెద్ద ఎత్తున వారిపై ఒత్తిడి వచ్చినట్లు నియోజకవర్గం లో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఎంపీ రాములు మౌనం బిఆర్ఎస్ పార్టీకి పెద్ద ముప్పుగానే పరిణమిల్లనుంది ఎంపీ ఆయన కుమారుడు ఇద్దరూ ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి త్వరలో చేరబోతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఎంపీ ఎమ్మెల్యేల మధ్యన ఎడమొహం పెడమొహం పార్టీ క్యాడర్ కు ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితి నెల రోజుల్లో  ఇదేవిధంగా ఉంటే పోలింగ్ నాటికి బిఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా తయారవుతుందో అని అచ్చంపేటలో గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ ఎన్నికలు ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు సవాల్ గా మారాయి