గొడవతో ద్విచక్ర వాహనం దగ్ధం

గొడవతో ద్విచక్ర వాహనం దగ్ధం

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ జిల్లా: తండ్రి కుమారుడి మధ్య గొడవ చోటు చేసుకోవడంతో తండ్రి  పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడను ఆనుకొని ఉన్న కుమారుడి ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది వెంటనే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించిన సిబ్బంది సిలిండర్లను తీసుకొని సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించడంతో అందులో ఉన్న కెమికల్ అయిపోవడంతో చేసేది లేక దిక్కుతోచని స్థితిలో ఫైర్ సిబ్బంది నిలుచున్నారు అక్కడికి చేరుకున్న ప్రజలు అగ్నిమాపక సిబ్బంది నిర్వాకంతో పక్కు న నవ్వుకున్నారు.