ఒక్క అవకాశం ఇవ్వండి అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం

ఒక్క అవకాశం ఇవ్వండి అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం
  • జడ్పీటీసి సభ్యురాలు డా.అనూరాధ

ముద్ర, అచ్చంపేట నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో అచ్చంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని అమ్రాబాద్ జెడ్పిటిసి సభ్యురాలు డాక్టర్ అనురాధ ప్రజలకు పిలుపునిచ్చారు శుక్రవారంఅచ్చంపేట మండలం చౌటపల్లి, గుంపన్ పల్లి  గ్రామంలో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారకార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.అచ్చంపేట లో  కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనిఅన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ పథకాలతో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, 500 కు సిలిండర్ ,   ప్రతి రైతుకు ఎకరానికి ₹7500 చొప్పున రెండు విడతలుగా 15000 రూపాయలు, అలాగే మహిళలకు ప్రతి మహిళకు 2500 చొప్పున ప్రతినెల చెల్లిస్తుందన్నారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్తు,ఇలాగే పెద్ద ఎత్తున రైతులకు మహిళలకు మేలు చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పథకాలు ఉంటాయి, కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు డాక్టర్ అనురాధ చేపడుతున్న ప్రజలకు ప్రజలు ఘనంగా గ్రామంలో స్వాగతం పలికారు.